వినాయక చవితి సందర్భంగా అనేక ప్రాంతాల్లో ఉత్సవ మండపాలు ఏర్పాటు చేస్తారు. కానీ మండపం పెట్టాలంటే తప్పనిసరిగా పోలీస్ పర్మిషన్ అవసరం. ప్రస్తుతం ఈ అనుమతి కోసం ఆన్‌లైన్‌లోనే అప్లై చేయగల అవకాశం ఉంది. ఈ ఆర్టికల్ ద్వారా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
పోలీస్ పర్మిషన్ ఎందుకు అవసరం?
ఉత్సవాలు ప్రశాంతంగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా జరగడానికి
భద్రతా కారణాల కోసం
ట్రాఫిక్, నిమజ్జనం (Immersion) వంటి సమయంలో సులభతరం కావడానికి
చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండడానికి
ganesh mandapam police permission ap :
👉 Related: ఖైరతాబాద్ గణేష్ 2025 ప్రత్యేకతలు
అప్లై చేయడానికి అవసరమైన వివరాలు
పర్మిషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ముందు కొన్ని వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి:
కమిటీ వివరాలు – కనీసం 5 మంది సభ్యుల పేర్లు మరియు మొబైల్ నంబర్లు
విగ్రహం ఎత్తు – ఎన్ని అడుగుల విగ్రహం పెడతారు
మండపం వివరాలు – ఎక్కడ పెడుతున్నారు (టెంపుల్, కాలనీ, కమ్యూనిటీ సెంటర్ మొదలైనవి)
నిమజ్జనం వివరాలు – ఎక్కడ, ఎప్పుడు, ఏ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా నిమజ్జనం చేస్తారు
👉 Related: వినాయక చవితి పూజా విధానం
ఆన్‌లైన్‌లో పర్మిషన్ కోసం అప్లై చేసే విధానం
1. వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
గూగుల్‌లో Ganesh Utsav AP Police అని సెర్చ్ చేయండి.
అధికారిక సైట్ 👉 Ganesh Utsav AP Police Portal ఓపెన్ అవుతుంది.
2. కొత్త అప్లికేషన్ ఫామ్
హోమ్‌పేజీలో Apply Here అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ముందుగా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫై చేయాలి.
3. అప్లికెంట్ వివరాలు
పేరు, ఇమెయిల్, అడ్రెస్ ఎంటర్ చేయాలి.
మీ కమిటీ లేదా అసోసియేషన్ పేరు కూడా ఇవ్వాలి.
4. మండపం & విగ్రహం వివరాలు
విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, లొకేషన్ (door number, colony, district, police station) వంటివి నమోదు చేయాలి.
5. కమిటీ సభ్యుల వివరాలు
కనీసం ఐదుగురి పేర్లు + మొబైల్ నంబర్లు ఇవ్వాలి.
6. నిమజ్జనం వివరాలు
తేదీ, సమయం, ప్రదేశం (నది, చెరువు, సముద్రం మొదలైనవి) ఎంటర్ చేయాలి.
ట్రాన్స్‌పోర్ట్ మోడ్ (ఆటో, ట్రక్, లారీ) సెలెక్ట్ చేయాలి.
7. Submit చేసి Application Number పొందండి
అన్ని వివరాలు సరైనవిగా ఫిల్ చేసిన తర్వాత Submit చేయాలి.
ఒక Application Number వస్తుంది.
స్టేటస్ & NOC చెక్ చేయడం
హోమ్‌పేజీలో Download NOC / Status ఆప్షన్ ఉంటుంది.
మొబైల్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.
Approved అయితే Green కలర్‌లో చూపిస్తుంది.
Rejected అయితే Red కలర్‌లో చూపిస్తుంది.
Approved అయితే, ఒక QR కోడ్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసి మండపం దగ్గర పెట్టుకోవాలి.
QR కోడ్ ఎందుకు అవసరం?
పోలీసులు చెక్ చేసినప్పుడు, QR కోడ్ స్కాన్ చేస్తే మీ పర్మిషన్ డీటెయిల్స్ వెంటనే కనిపిస్తాయి.
ఇది మీ పర్మిషన్ ఒరిజినల్ అని నిర్ధారిస్తుంది.
పాటించవలసిన జాగ్రత్తలు
మండపంలో సేఫ్టీ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలి.
ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి.
సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఎలక్ట్రిక్ కనెక్షన్లు సేఫ్‌గా ఉండాలి.
నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు పాటించాలి.
👉 Related: Vinayaka Ashtottara 108 Names in Telugu PDF
ముగింపు
వినాయక చవితి ఉత్సవం శుభప్రదమైన వేడుక. కానీ చట్టపరంగా మరియు భద్రతాపరంగా అన్ని విధాలా సక్రమంగా నిర్వహించడం చాలా ముఖ్యం. అందుకే మండపం ఏర్పాటు చేసే ముందు పోలీస్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో సులభంగా ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. మండపం కోసం పర్మిషన్ తప్పనిసరినా?
అవును, పోలీస్ పర్మిషన్ లేకుండా మండపం పెట్టితే అది లీగల్ ప్రాబ్లమ్స్‌కి దారితీస్తుంది.
2. పర్మిషన్ ఫీజు ఏమైనా ఉందా?
సాధారణంగా పర్మిషన్ ఉచితమే, కానీ కొన్నిసార్లు లొకల్ గైడ్‌లైన్స్ ఆధారంగా చెల్లింపులు ఉండవచ్చు.
3. ఒకే కమిటీకి మల్టిపుల్ మండపాలకు అప్లై చేయవచ్చా?
అవును, కానీ ప్రతి మండపం కోసం వేర్వేరుగా అప్లై చేయాలి.